కాంగ్రెస్ సిద్ధాంతాలకు వ్యతిరేకంగా తెలుగుదేశం పార్టీ ఆవిర్భవించిందంటూ ఇంతకాలం గొప్పలు చెప్పుకున్న టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఇప్పుడు అదే కాంగ్రెస్‌తో పొత్తు కోసం తహతహలాడుతున్నారు! ఇటీవల బీజేపీతో తెగతెంపులు చేసుకున్న చంద్రబాబు దృష్టి కొంతకాలంగా కాంగ్రెస్‌పై పడింది. ఇందులో భాగంగా వచ్చే ఎన్నికల్లో పొత్తు కోసం ఆ పార్టీ అధ్యక్షుడు రాహుల్‌గాంధీతో తెర వెనుక దౌత్యం నడుపుతూ వచ్చిన చంద్రబాబు ఇప్పుడు ఎన్నికలు దగ్గర పడుతుండటంతో నేరుగానే ఆ పార్టీ నేతలతో చర్చలు జరుపుతున్నారు. పొత్తు కుదుర్చుకోవడానికి ముందే కాంగ్రెస్‌లో ఫలానా వారిని చేర్చడానికి వీలుగా ఓ జాబితాను రూపొందించుకున్నారు.