టీఆర్‌ఎస్‌లో చేరనున్న ఎమ్మెల్యే కందాల | Congress mla Kandala Upender Reddy to join TRS soon | Sakshi
Sakshi News home page

టీఆర్‌ఎస్‌లో చేరనున్న ఎమ్మెల్యే కందాల

Mar 14 2019 4:53 PM | Updated on Mar 20 2024 4:07 PM

లోక్‌సభ ఎన్నికలు దగ్గర పడుతున్న నేపథ్యంలో తెలంగాణలో కాంగ్రెస్‌ పార్టీకి దెబ్బ మీద దెబ్బ పడుతోంది. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీ తరఫున గెలిచిన ఎమ్మెల్యేలు ఒక్కొక్కరుగా ’హ్యాండ్‌’  ఇస్తున్నారు. ఇప్పటికే పలువురు కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు టీఆర్‌ఎస్‌లో చేరిన విషయం తెలిసిందే. మరోవైపు మాజీమంత్రి, కాంగ్రెస్ పార్టీ సీనియర్‌ నేత సబితా ఇంద్రారెడ్డి కూడా టీఆర్‌ఎస్‌లో చేరబోతున్నారు. తాజాగా ఖమ్మం జిల్లా పాలేరు నియోజకవర్గ  ఎమ్మెల్యే కందాల ఉపేందర్‌ రెడ్డి ...కాంగ్రెస్‌ పార్టీకి రాజీనామా చేశారు. త్వరలో కారు ఎక్కనున్న ఆయన  గురువారం టీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ను కలిశారు. 

Advertisement
 
Advertisement

పోల్

Advertisement