విశాఖపట్నంలోని సిరిపురం వుడా చిల్డర్డ్స్ ఎరీనా పార్క్‌లో సిట్ ఫిర్యాదుల స్వీకరణ మూడో రోజు ప్రారంభమైంది. సిట్‌కు ఫిర్యాదు చేయడానికి మూడో రోజు అధిక సంఖ్యలో వస్తుండడంతో సిట్ సభ్యులు అనురాధ, భాస్కర్ రావు పరిశీలిస్తున్నారు. ఈ నేపథ్యంలో తొలి రెండు రోజులు వచ్చిన 236 ఫిర్యాదుల్లో 41 సిట్ పరిధిలోకి రాగా, మిగతా 195 దీని పరిధిలోకి రాలేదు. కాగా, రెండవ రోజున మొత్తం 27 సిట్ ఫిర్యాదులు రాగా వాటిలో ఆన్‌లైన్‌లో ఏడు, భీమునిపట్నం మూడు, గాజువాక రెండు, గోపలపట్నం ఒకటి, పరవాడ మూడు, పద్మనాభం ఒకటి, పెందుర్తి ఆరు, సబ్వరం రెండు ఉన్నాయి.