సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ తెరకెక్కిస్తున్న ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ చిత్రం విడుదలకు ముందే తెలుగు రాష్ట్రాల్లో ప్రకంపనలు సృష్టిస్తోంది. తాజాగా ఈ సినిమాపై టీడీపీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఉలిక్కిపడుతున్నారు. గుమ్మడికాయల దొంగ ఎవరంటే భుజాలు తడుముకున్నట్లు... ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ గురించి సీఎం చంద్రబాబు ఏకంగా పార్టీ నేతలతో నిర్వహించిన టెలీ కాన్ఫరెన్సులో ప్రస్తావించడం విశేషం.