సీఎస్‌పై చంద్రబాబు మరోసారి అసహనం | Chandrababu Naidu Comments On Andhra Pradesh Chief Secretary | Sakshi
Sakshi News home page

సీఎస్‌పై చంద్రబాబు మరోసారి అసహనం

May 3 2019 6:46 PM | Updated on Mar 22 2024 10:40 AM

రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎ‍ల్వీ సుబ్రహ్మణ్యం, ఉన్నత అధికారులపై ఆపద్దర్మ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మరోసారి అసహనం వ్యక్తం చేశారు. ఫొని తుపాను నేపథ్యంలో ఎన్నికల సంఘం కోడ్‌ను సడలించడంతో చంద్రబాబు శుక్రవారం సమీక్షించారు. అనంతరం విలేకరులతో మాట్లాడుతూ... అధికారులపై అక్కసు వెళ్లగక్కారు. ‘అన్ని రాష్ట్రాలలో సీఎస్‌లు ముఖ్యమంత్రి రిపోర్ట్ చేస్తారు. మన దగ్గర మాత్రం ప్రధాన కార్యదర్శి సీఎం వద్దకు రారు.

Advertisement
 
Advertisement
Advertisement