ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు మేడిన్ మీడియా. ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి మేడిన్ పబ్లిక్. అదీ ఆయనకూ ఈయనకూ తేడా. వైఎస్సార్ కాంగ్రెస్‌కు ఒక్క పేపరే ఉందేమో. చంద్రబాబుకు చాలా పేపర్లున్నాయి. వండుకున్నవాళ్లకు ఒకకూరే. దండుకున్న వాళ్లకు దండిగా అన్నట్టుంది బాబు వ్యవహారం... అని వ్యవసాయ శాఖ మంత్రి కురసాల కన్నబాబు అన్నారు. ఏపీ అసెంబ్లీ ఆంగ్ల మాధ్యమంపై చర్చ సందర్భంగా చంద్రబాబు చేసిన వ్యాఖ‍్యలకు మంత్రి కన్నబాబు పైవిధంగా స్పందించారు.