విధుల్ని పక్కన పెట్టి బెటాలియన్ పోలీసులు బరితెగించారు. భవానీపురం పోలీస్ స్టేషన్‌లో ఉన్న అకామిడేషన్ కేంద్రంలో పేకాట ఆడుతూ అడ్డంగా బుక్కయ్యారు. స్టేషన్‌లోనే ఉన్న బ్యారక్‌లో నిత్యం పేకాటాడుతూ, మద్యం తాగి వివాదాల్లో నిలవడం పరిపాటి అయ్యింది. ఆరెస్సై శ్రీనివాసరావు సమక్షంలోనే సహచర కానిస్టేబుళ్లు పేకాడుతుండటం ఆశ్యర్యం కలిగిస్తోంది.