టీడీపీ ఎమ్మెల్యే కింజరపు అచ్చెన్నాయుడు పోలీసు ఉన్నతాధికారిపై నోరు పారేసుకున్నారు. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు నివాసం వద్ద పోలీసులపై చిందులు తొక్కారు. ‘ఛలో ఆత్మకూరు’ పిలుపు నేపథ్యంలో శాంతి భద్రతలను దృష్టిలో ఉంచుకుని పోలీసులు ముందస్తుగా 144 సెక్షన్ విధించారు. బుధవారం చంద్రబాబు నివాసానికి వచ్చిన అచ్చెన్నాయుడు, మహిళా కమిషన్ మాజీ చైర్‌పర్సన్ నన్నపనేని రాజకుమారిలను పోలీసులు అడ్డుకున్నారు. పల్నాడులో ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో 144 సెక్షన్ అమల్లో ఉన్నందున లోపలకు వెళ్లనీయబోమని వారికి ఎస్పీ విక్రాంత్ పటేల్ సర్దిచెప్పే ప్రయత్నం చేశారు.
ఏయ్ ఎగస్టా చేయొద్దు..
Sep 11 2019 9:20 AM | Updated on Mar 21 2024 8:31 PM
Advertisement
Advertisement
పోల్
Advertisement