అంత ఈజీగా వదిలిపెట్టను : చంద్రబాబు | Ap Cm Chandrababu Naidu Argument With CEO Gopal Krishna Dwivedi | Sakshi
Sakshi News home page

అంత ఈజీగా వదిలిపెట్టను : చంద్రబాబు

Apr 10 2019 5:30 PM | Updated on Mar 22 2024 11:16 AM

ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తన వైఖరిని మరోసారి బయట పెట్టుకున్నారు. రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి గోపాలకృష్ణ ద్వివేదికి వినతిపత్రం సమర్పిస్తూనే...మరోవైపు ఎన్నికల సంఘంపై అక్కసు వెళ్లగక్కారు. మీ ఇష్టం వచ్చినట్లు చేస్తున్నారంటూ దురుసుగా ప్రవర్తించారు.  కేంద్ర ఎన్నికల సంఘం  నిర్ణయాలను వ్యతిరేకిస్తున్నామంటూ చంద్రబాబు నాయుడు బుధవారం  రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి గోపాలకృష్ణ ద్వివేదిని కలిసి వినతి పత్రం సమర్పించారు. అయితే ద్వివేదితో మాట్లాడుతున్న సమయంలో చంద్రబాబు... బెదిరింపులకు పాల్పడుతున్నట్లు ఉందే తప్ప... వినతి పత్రం సమర్పిస్తున్నట్లు కనిపించడం లేదు.

Related Videos By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement