బీఎస్‌ఎఫ్‌ జవాన్‌ గొంతు కోసిన పాక్ సైనికులు | Anti-Pakistan protest in Jammu against brutal killing of BSF jawan | Sakshi
Sakshi News home page

బీఎస్‌ఎఫ్‌ జవాన్‌ గొంతు కోసిన పాక్ సైనికులు

Sep 20 2018 7:44 AM | Updated on Mar 22 2024 11:28 AM

జమ్మూ కశ్మీర్లో అంతర్జాతీయ సరిహద్దు వద్ద పాకిస్తానీ సైనికులు దారుణానికి తెగబడ్డారు. సరిహద్దు భద్రతా దళం(బీఎస్‌ఎఫ్‌)కు చెందిన ఓ జవానును తుపాకీతో కాల్చి, గొంతుకోసి చంపేశారు. జమ్మూ ప్రాంతంలోని రామ్‌గఢ్‌ సెక్టార్‌లో మంగళవారం ఈ ఘటన జరిగింది. బీఎస్‌ఎఫ్‌ విడుదల చేసిన ఓ ప్రకటన ప్రకారం.. రామ్‌గఢ్‌ సెక్టార్‌లోని సరిహద్దు కంచె వద్ద ఎత్తుగా పెరిగిన ఏనుగుల గడ్డిని కోసేందుకు బీఎస్‌ఎఫ్‌ జవాన్లు వెళ్లారు. సరిహద్దులు స్పష్టంగా కనిపించడం కోసం ఇలాంటి అడ్డుగా ఉన్న గడ్డిని జవాన్లు కోయడం సాధారణమే.

Related Videos By Category

Advertisement
 
Advertisement

పోల్

Advertisement