అనుకున్న సమయానికల్లా పోలవరం ప్రాజెక్టు పనులు పూర్తి చేస్తామని నీటిపారుదల శాఖా మంత్రి అనిల్‌కుమార్ యాదవ్ అన్నారు. నవంబర్ 1 తేదీ నుంచి పనులు ప్రారంభిస్తామని చెప్పినట్లుగానే శుక్రవారం నుంచి పోలవరం పనులు మొదలు కానున్నాయని హర్షం వ్యక్తం చేశారు. హైకోర్టు తీర్పును స్వాగతిస్తున్నామని... తమ ప్రభుత్వ సంకల్పం మంచిది కాబట్టే తమకు అనుకూలంగా హైకోర్టు తీర్పు వెలువడిందన్నారు. పోలవరం జల విద్యుత్ ప్రాజెక్టు(పీహెచ్‌ఈపీ) పనులను థర్డ్ పార్టీకి అప్పగించేందుకు అడ్డుగా ఉన్న ఉత్తర్వులను హైకోర్టు తొలగించిన విషయం తెలిసిందే. రివర్స్ టెండరింగ్ కింద ఆగస్టులో జారీ చేసిన నోటిఫికేషన్‌కు అనుగుణంగా ప్రాజెక్టు పనులను థర్డ్ పార్టీకి అప్పగించే ప్రక్రియను మొదలుపెట్టరాదని ప్రభుత్వాన్ని ఆదేశిస్తూ గతంలో ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులను గురువారం ఎత్తి వేసింది.
వాళ్లు నవయుగతో తేల్చుకుంటారు
Nov 1 2019 12:16 PM | Updated on Nov 1 2019 12:42 PM
Advertisement
Advertisement
పోల్
Advertisement