చిల్లర రాజకీయాలు మానుకోవాలి | Anil Kumar Yadav Responds Over Reverse Tendering Success | Sakshi
Sakshi News home page

చిల్లర రాజకీయాలు మానుకోవాలి

Sep 21 2019 12:40 PM | Updated on Sep 21 2019 12:45 PM

దేశంలోనే మొట్టమొదటి రివర్స్ టెండరింగ్ సక్సెస్ అయిందని ఏపీ ఇరిగేషన్‌ శాఖ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ ఆనందం వ్యక్తం చేశారు. పోలవరం లెఫ్ట్ కెనాల్ పనుల్లో రివర్స్ టెండర్ల ద్వారా గతం కంటే 20.33 శాతం మిగులు లభించిందని, మొత్తం రూ. 290 కోట్ల పనుల్లో దాదాపు రూ. 58 కోట్లు ఖజానాకు ఆదా అయ్యాయని తెలిపారు. సాగునీటి ప్రాజెక్టులకు సంబంధించి మరిన్ని టెండర్లలో రివర్స్‌ టెండరింగ్‌ అమలుచేస్తామని అనిల్‌ కుమార్‌ స్పష్టం చేశారు. ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి రివర్స్ టెండర్లలో విజయం సాధించి.. దేశంలోని అన్ని రాష్ట్రాలకు ఆదర్శంగా నిలిచారని అన్నారు. ఆయన శనివారం విలేకరులతో మాట్లాడారు. 

Related Videos By Category

Related Videos By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement