బీజేపీ టోపీని నిరాకరించిన అమిత్‌ షా మనవరాలు | Amit Shah's granddaughter refuses to wear BJP hat | Sakshi
Sakshi News home page

బీజేపీ టోపీని నిరాకరించిన అమిత్‌ షా మనవరాలు

Mar 30 2019 1:12 PM | Updated on Mar 22 2024 11:30 AM

బీజేపీ జాతీయ అధ్యక్షులు అమిత్‌ షా శనివారం గాంధీనగర్‌ లోక్‌సభ స్థానానికి నామినేషన్‌ దాఖలు చేసిన విషయం తెలిసిందే. ఆయన తన కుటుంబసమేతంగా కలిసి వచ్చి నామినేషన్‌ వేశారు. అయితే ఈ కార్యక్రమంలో ఓ ఆసక్తికరమైన ఘటన చోటుచేసుకుంది. అమిత్‌ షా  తన మనవరాలుకి కషాయరంగుతో ఉన్న టోపీలో పెట్టడానికి ప్రయత్నించాడు. అయితే ఆమె మాత్రం దానిని పెట్టుకోవడానికి మాత్రం నిరాకరించింది. తన హ్యాట్‌ మాత్రమే పెట్టుకుంటానని అమిత్‌ షా పెట్టిన బీజేపీ టోపిని తీసేసింది. ఈ వీడియో వైరల్‌గా మారింది. కాగా అమిత్‌ షా తొలిసారి లోక్‌సభ బరిలో నిలుస్తోన్న విషయం తెలిసింది. గాంధీనగర్‌ నుంచి ఆరుసార్లు విజయం సాధించిన బీజేపీ అగ్రనేత ఎల్‌కే అద్వానీని పక్కన పెట్టి షాని బరిలో నిలిపింది. 

Related Videos By Category

Advertisement
 
Advertisement
Advertisement