ఇటీవల ప్రభాస్ సాహో సినిమా షూటింగ్ లో భాగంగా లాస్ ఏంజిల్స్ వెళ్లాడు. అక్కడి ఎయిర్‌పోర్ట్‌లో ప్రభాస్‌తో సెల్ఫీ దిగేందుకు అభిమానులు పోటీపడ్డారు. ఈ సందర్భంగా ప్రభాస్‌తో సెల్ఫీ దిగిన ఓ యువతి.. గంతులు వేస్తూ ప్రభాస్ చెంపను తడిమింది. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. సాహో షూటింగ్ చివరి దశకు చేరుకోవటంతో నిర్మాణానంతర కార్యక్రమాలు పూర్తి చేసి ఆగస‍్టు 15న సినిమాను రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు.