పిల్లలు ఆరోగ్యంగా ఉన్నప్పుడే బాగా చదవగలుగుతారు అని మధ్యాహ్న భోజనంలో సమూల మార్పులు చేసి ‘జగనన్న గోరుముద్ద’ పథకం ద్వారా ప్రత్యేక మెనూతో పిల్లలకు నచ్చేలా రోజుకొక వెరైటీ భోజనం మన ప్రభుత్వం అందిస్తోంది. పిల్లలకు మేనమామగా వారి ఆరోగ్యం పట్ల సీఎం వైయస్ జగన్ అత్యంత శ్రద్ధ చూపుతున్నారు.
బలవర్ధకమైన పౌష్టికాహారాన్ని అందించడం ద్వారా విద్యార్థులను సంపూర్ణ ఆరోగ్యవంతులుగా తీర్చిదిద్దడమే జగనన్న గోరుముద్ద పథకం ఉద్దేశం.
