సాహో సినిమా విడుదల తేది దగ్గర పడుతుండటంతో ఆ సినిమాకు సంబంధించిన ఒక్కోవార్త సోషల్ మీడియాల్లో, వార్తల్లో చక్కర్లు కొడుతున్నాయి. ఈ చిత్రంలోని మూడు పాటలను ఒక్కొట్టిగా రీలిజ్ చేస్తూ ప్రేక్షకులను ఊరిస్తూ వస్తున్న దర్శకుడు, నిర్మాతలు తాజాగా ‘బేబీ వొంట్ యూ టెల్ మీ’ పాటను విడుదల చేశారు. ఈ పాట విడుదలైన ఒక్క గంటలోనే నాలుగు లక్షలకు పైగా వ్యూలు వచ్చాయి. దీంతో హీరో ప్రభాస్ ‘సాహో నుంచి రోమాంటిక్, మెలోడియస్ పాట విడుదల’ అంటూ తన ఇన్‌స్టాగ్రామ్‌లో ఈ పాటకు సంబంధించన ఫస్ట్ లుక్‌ను పోస్ట్ చేశాడు. ప్రభాస్, శ్రద్ధ కపూర్‌లు రోమాంటిక్ ప్రేమ జంటగా కనిపిస్తున్న సాఫ్ట్ ట్రాక్ లో మెలోడి పాటగా సంగీత ప్రీయులను ఆకట్టుకుంటోన్నఈ పాటకు మనోజ్ యాదవ్ లిరిక్స్‌ని అందించాడు.
సాహో కొత్త పాట విడుదల!
Aug 26 2019 6:24 PM | Updated on Aug 26 2019 6:24 PM
Advertisement
Advertisement
పోల్
Advertisement