‘నీతో కలిసి చచ్చేంత ప్రేమ నాలో ఉంది.. నాతో కలిసి బతకాలన్న ఆలోచనే నీలో లేదు.. ఐ హేట్ యూ’అంటూ ట్రైలర్‌లో హీరోయిన్ పలికే మాటలు ప్రేమికుల గుండెలను కదిలించేలా ఉంది. ‘కొందరకి మందు తాగడం సరదా.. మరికొందరికి అది వ్యసనం.. కానీ మీ బాబుకు అది అవసరం, ఏ జన్మలో ఏ యాగం చేశారో ఈ రాజావారు ఈ జన్మలో ఈ యోగంతో పుట్టారు’ఈ డైలాగ్‌లతో ఈ సినిమాకు 90 ఎంఎల్ అని టైటిల్ ఎందుకు పెట్టారో అర్థమవుతోంది. అదేవిధంగా స్టోరీ కూడా తెలిసిపోయింది. ఇక తనకున్న వీక్‌నెస్‌తో ప్రేమలో పడిన కష్టాలు, అమ్మాయి కుటుంబసభ్యులతో ఎదురైన సంఘటనలు చూస్తుంటే సినిమాపై ఆసక్తి పెరుగుతోంది. ఇక మధ్యలో హీరోయిన్ హీరోను వదిలి వెళ్లిపోతుంటే ‘కన్నులు వదిలి కల వెళుతుందే.. గుండెను వదిలి లయ వెళుతుందే.. గుడినే వదిలి దేవత వెళుతుందే’ వచ్చే సాంగ్ సూపర్బ్. ఇక చివర్లో ‘నా మందు తాగి నన్నే కొడతాడా.. వదలను’అని చెప్పే డైలాగ్‌తో ట్రైలర్ ముగుస్తుంది.
‘మందు తాగడం మీ బాబుకు అవసరం’
Nov 21 2019 12:27 PM | Updated on Nov 21 2019 12:27 PM
Advertisement
Advertisement
పోల్
Advertisement