హలో టీజర్‌ వచ్చేసింది

అక్కినేని యంగ్‌ హీరో అఖిల్‌ కొత్త సినిమా హలో టీజర్‌ కాసేపటి క్రితం విడుదలైంది. మనం ఫేమ్‌ విక్రమ్‌ కే కుమార్‌ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్న విషయం తెలిసిందే. ఇక టీజర్‌ విషయానికొస్తే.. మొత్తం యాక్షన్‌ సన్నివేశాలతో నింపేశారు. చిన్నతనంలో విడిపోయిన ఇద్దరు స్నేహితులు.. పెద్దయ్యాక ఆ అమ్మాయిని వెత్కుకుంటూ అన్వేషణ కొనసాగించే యువకుడి పాత్రలో అఖిల్‌ కనిపించబోతున్నాడని హింట్ ఇచ్చేశారు. టీజర్‌కు తగ్గట్లు అనూప్‌ రూబెన్స్ అందించిన బ్యాగ్రౌండ్ స్కోర్‌ ఆకట్టుకుంది.

Read latest News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

మరిన్ని వీడియోలు



 

Read also in:
Back to Top