దలాల్ స్ట్రీట్‌నూ మోదీ మేనియా తాకింది. ఆకాశమే హద్దుగా సెన్సెక్స్, నిఫ్టీ దూసుకువెళ్లాయి. బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే సార్వత్రిక సమరంలో ఘన విజయం సాధిస్తుందన్న ఎగ్జిట్ పోల్స్ ఫలితాలతో సోమవారం స్టాక్ మార్కెట్లు సత్తా చాటాయి. కొనుగోళ్ల వెల్లువతో అన్ని రంగాల షేర్లు అమాంతం ఎగిశాయి.