తొలి టెస్టు పుణేలో టీమిండియా చూపిన దారుణ ప్రదర్శనను మరోసారి పునరావృతం కానివ్వబోమని కెప్టెన్ విరాట్ కోహ్లీ అన్నాడు. ఆస్ట్రేలియాతో జరుగుతున్న నాలుగు టెస్టుల సిరీస్ లో భాగంగా తొలి టెస్టులో భారత్ 333 పరుగుల తేడాతో భారీ పరాభవాన్ని మూటకట్టుకున్న విషయం తెలిసిందే. ఈ దారుణ ఓటమి నుంచి పాఠాలు చేర్చుకున్నామని చెప్పాడు. పుణే లాంటి ప్రదర్శనను టీమిండియా ఇక ఎప్పుడూ పునరావృతం చేయదని, ఇందుకు తాను హామీ అని కోహ్లీ తెలిపాడు. అయితే బెంగళూరులో జరగనున్న రెండో టెస్టు కోసం తమ జట్టులో కొన్ని సర్ ప్రైజ్ నిర్ణయాలు తీసుకుంటామన్నాడు.