భారత్‌ను మరో విజయం ఊరిస్తోంది..! | Third Test from today | Sakshi
Sakshi News home page

Nov 26 2016 7:48 AM | Updated on Mar 21 2024 9:55 AM

ఇంగ్లండ్‌తో ఐదు టెస్టుల సిరీస్‌లో భారత్‌కు ఒక్కసారిగా అన్నీ అనుకూలంగా మారిపోయారుు. రాజ్‌కోట్‌లో డ్రా అనంతరం విశాఖపట్నంలో దక్కిన భారీ విజయంతో జట్టు ఆత్మవిశ్వాసం పెరిగింది. ఆశించినట్లుగానే మరో స్పిన్ వికెట్ కూడా సిద్ధమైంది. ఇక్కడి పీసీఏ మైదానంలో గత 11 టెస్టులలో ఒక్కటి కూడా ఓడని రికార్డు భారత్‌కు ఉంది. ఈ నేపథ్యంలో ఇంగ్లండ్‌తో నేటినుంచి (శనివారం) జరిగే మూడో టెస్టుకు కోహ్లి సేన సిద్ధమైంది. సిరీస్‌లో ప్రస్తుతం 1-0 ఆధిక్యంలో ఉన్న భారత్... ఇక్కడా గెలిచి దానిని మరింత పెంచుకోవాలని పట్టుదలగా ఉంది. మరో వైపు రెండు టెస్టుల్లోనూ ఇంగ్లండ్ ఆట ‘పోరాటానికి’ పరిమితమైంది తప్ప వారికి అనుకూల ఫలితం రాలేదు. 2012లో 0-1తో వెనుకబడి సిరీస్‌ను గెలవగలిగిన ఇంగ్లండ్, ఈ మ్యాచ్‌లో అత్యుత్తమ ఆటతీరు కనబర్చాల్సి ఉంటుంది.

Advertisement
 
Advertisement
Advertisement