ఆస్ట్రేలియాతో తొలి టెస్టులో ఓటమికి చెత్త బ్యాటింగే కారణమని టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ నిందించాడు. గత రెండేళ్లలో తామాడిన టెస్టుల్లో ఇదే చెత్త బ్యాటింగ్ అని అన్నాడు. పుణె టెస్టులో భారత్ 333 పరుగుల తేడాతో ఆసీస్ చేతిలో చిత్తుగా ఓడిపోయింది. ఈ మ్యాచ్ మూడు రోజుల్లోనే ముగిసింది.