తొలి టెస్టులో వెస్టిండీస్ ను భారత్ చిత్తు చేసింది. బ్యాటింగ్లో రోహిత్ శర్మ, బౌలింగ్లో మహ్మద్ షమీ సత్తా చాటడంతో వెస్టిండీస్పై భారత్ ఇన్నింగ్స్ 51 పరుగులతో విజయం సాధించింది. అరంగ్రేట టెస్టులో రోహిత్, షమీ అదరగొట్టడంతో టీమిండియా మరో రెండు రోజులు మిగులుండగానే విజయాన్ని అందుకుంది. 219 పరుగుల తొలి ఇన్నింగ్స్ లోటుతో రెండో ఇన్నింగ్స్ ఆరంభించిన విండీస్ 168 పరుగులకే కుప్పకూలింది. సొంత మైదానంలో టెస్టు అరంగ్రేటం చేసిన షమీ సత్తా చాటాడు. భారత్ తరపున రెండో అత్యుత్తమ గణాంకాలు నమోదు చేశాడు. షమీ ధాటికి విండీస్ వికెట్లు పేక మేడలా కూలిపోయాయి. 118 పరుగులిచ్చి ఏకంగా 9 వికెట్లు నేలకూల్చాడు. రెండో ఇన్నింగ్స్ లో 13.1 ఓవర్లలో 47 పరుగులు మాత్రమే ఇచ్చిన షమీ ఏకంగా 5 వికెట్లు నేలకూల్చాడు. అశ్విన్ 3 వికెట్లు తీశాడు. భువనేశ్వర్ కుమార్ ఒక వికెట్ దక్కించుకున్నాడు. తొలి ఇన్నింగ్స్లో షమీ 4 వికెట్లు పడగొట్టాడు. తొలి ఇన్నింగ్స్లో భారత్ 453 పరుగులకు ఆలౌటయింది. రోహిత్ శర్మ 177, అశ్విన్ 124 పరుగులు చేశారు. రోహిత్ శర్మకు మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు దక్కింది.
Nov 8 2013 4:21 PM | Updated on Mar 21 2024 6:35 PM
Advertisement
Advertisement
Advertisement
