రత పర్యటన మును్మందు ఎంత కఠినంగా సాగబోతోందో ఆస్ట్రేలియా జట్టుకు టెస్టు సిరీస్ తొలి రోజే స్పష్టంగా అర్థమయ్యంది. తొలి సెషన్ లో.. ఫర్లేదు బాగానే ఆడుతున్నారే.. అనుకునేంతలో భారత బౌలర్లు విరుచుకుపడ్డారు. ముఖ్యంగా పేసర్ ఉమేశ్ యాదవ్ రివర్స్ స్వింగ్ దెబ్బకు కంగారూ బ్యాట్స్‌మెన్ ఒక్కొక్కరు తోకముడిచారు. అటు స్పిన్నర్లు అశ్విన్, జడేజా తమ వంతు సహకారం అందించడంతో భారత్ తొలి రోజే స్పష్టవైున ఆధిక్యాన్ని ప్రదర్శించగలిగింది.