ముఖ్యమంత్రి జయలలిత ఆరోగ్యం మెరుగుపడాలని ఆకాంక్షిస్తూ ఆదివారం తమిళనాడు వ్యాప్తంగా అన్నాడీఎంకే శ్రేణులు విశిష్ట పూజలు చేశారు. ప్రత్యేక వ్రతాన్ని పాటించి, పాల బిందెలతో వేలాది మంది ఆలయాలకు ఊరేగింపుగా వెళ్లి దేవతలకు అభిషేకాలు నిర్వహించారు. చర్చిల్లో కొవ్వొత్తులతో ప్రత్యేక ప్రార్థనలు చేశారు. మదురైలో జయ పేరవై, అన్నాడీఎంకే జిల్లా పార్టీ నేతృత్వంలో యాభై వేల మందితో పాల బిందెల ఊరేగింపు నిర్వహించారు. ఇందులో 25 వేల మంది మహిళలు పాల్గొన్నారు. సీఎం జయలలిత ఆరోగ్యంపై వదంతులు మంచి పద్ధతి కాదని కేంద్ర సమాచార, ప్రసారాలశాఖ మంత్రి వెంకయ్యనాయుడు వ్యాఖ్యానించారు. ఆదివారం రాత్రి ఆయన అపోలో ఆస్పత్రికివెళ్లి జయలలిత ఆరోగ్యం గురించి వైద్యులను అడిగి తెలుసుకున్నారు. తర్వాత మీడియాతో మాట్లాడుతూ.. జయలలిత కోలుకుంటున్నట్లు తెలిపారు. ఆమె త్వరగా కోలుకోవాలని భగవంతుని ప్రార్థిస్తున్నట్లు తెలిపారు. కాగా, ఉదయం పుదుచ్చేరి సీఎం నారాయణస్వామి కూడా అపోలో ఆస్పత్రికి వెళ్లి జయలలిత ఆరోగ్యంపై డాక్టర్లను అడిగి తెలుసుకున్నారు. సీపీఐ ఎంపీ రాజాలతో పాటు పలువురు నేతలు ఆస్పత్రిలో జయ ఆరోగ్యంపై ఆరాతీశారు. జయ ఆరోగ్యవంతురాలుగా మళ్లీ ప్రజాసేవకు అంకితం కావాలని దేవుడ్ని ప్రార్థిస్తున్నట్టు వారు మీడియాతో మాట్లాడుతూ చెప్పారు.
Oct 10 2016 2:41 PM | Updated on Mar 21 2024 7:52 PM
Advertisement
Advertisement
పోల్
Advertisement