పట్టిసీమ నీళ్లు తోడే ప్రాజెక్టుకాదని, డబ్బులు తోడే ప్రాజెక్టు అని మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ అన్నారు. శుక్రవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. రెండున్నరేళ్ల నుంచి అనేక అంశాలపై రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నానని, కనీసం ఆఫీస్ అటెండర్ నుంచి కూడా సమాధానం రాలేదని వాపోయారు.