కృష్ణా జిల్లాలో సంచలనం సృష్టించిన యాసిడ్ దాడి కేసు మిస్టరీ వీడింది. మృతురాలే దాడి చేయిందని పోలీసుల దర్యాప్తులో వెల్లడైంది. తన ప్రియుడిపై దాడి చేయాలకున్న ఆమె ప్రయత్నం బెడిసి కొట్టడంతో రాణి ప్రాణాలు పోగొట్టుకుంది. తనతో సహజీవనం చేస్తున్న కఠారి రాజేష్ కు పెళ్లి కుదరడంతో అతడిపై యాసిడ్ చేసేందుకు ఇద్దరు యువకులతో రాణి ఒప్పందం కుదుర్చుకుంది. ప్లాన్ లో భాగంగానే కృష్ణా జిల్లాలో గన్నవరం మండలం కేసరపల్లి సమీపంలో బుడమేరు వంతెన వద్ద శుక్రవారం రాత్రి రాజేష్, రాణిపై యాసిడ్ దాడి జరిగింది. అయితే దాడి సమయంలో రాణి బైకు పైనుంచి కింద పడిపోడంతో తలకు గాయమై ఆస్పత్రిలో మృతి చెందింది. దాడికి పాల్పడిన ఇద్దరు నిందితులను అదుపులోకి తీసుకుని పోలీసులు విచారించడంతో కేసు మిస్టరీ వీడింది.
Jun 29 2015 1:37 PM | Updated on Mar 20 2024 2:08 PM
Advertisement
Advertisement
పోల్
Advertisement