సురక్షితంగా ఇంజనీర్ల విడుదల | telugu-engineers-released-safely | Sakshi
Sakshi News home page

Jul 29 2014 8:33 PM | Updated on Mar 21 2024 8:10 PM

అసోంలో కిడ్నాప్కు గురైన విజయవాడకు చెందిన ఇద్దరు ఇంజనీర్లు సురక్షితంగా విడుదలయ్యారు. అసోంలోని బీమాన్‌పూర్‌లో వీరిద్దరిని ఈనెల 27వ తేదీన నాగాలాండ్ తీవ్రవాదులు విజయవాడలోని కరెన్సీనగర్‌కు చెందిన రఘు, ప్రదీప్‌చంద్రలను కిడ్పాప్ చేసిన విషయం తెలిసిందే. తీవ్రవాదులు వారిని సురక్షితంగా విడుదల చేశారు. మరో గంటలో వారు సురక్షిత ప్రాంతాలకు చేరుకుంటారు. తాము తీవ్రవాదుల చెర నుంచి విడుదలయ్యామని ఇంజనీర్లు తల్లిదండ్రులకు ఫోన్ చేశారు. రత్నా కన్‌స్ట్రక్షన్‌ కంపెనీ ప్రతినిధులతో తీవ్రవాదులు జరిపిన చర్చలు సఫలమయ్యాయి. రఘు, ప్రదీప్లు పృధ్వీ కన్స్ట్రక్షన్ కంపెనీలో సూపర్ వైజర్లుగా పనిచేస్తున్నారు. వారిని విడుదల చేసేందుకు తీవ్రవాదులు తొలుత 20 కోట్ల రూపాయలు డిమాండ్ చేశారు. గతంలో కూడా బోడో తీవ్రవాదులు అక్కడ పనిచేసే తెలుగు వారిని అపహరించుకు వెళ్లిన విషయం తెలిసిందే.

Advertisement

Related Videos By Category

Advertisement
 
Advertisement
Advertisement