కడ్తాల్ మండలం మైసిగండి గ్రామ పంచాయితీ పరిధిలోని వెలుగురాళ్ల తండాలో 19 సంవత్సరాల ఓ యువతి పెళ్లి కాకుండానే గర్భవతయిందనే కోపంతో తల్లి, అన్నలు మానవత్వం మరచి.. తోబుట్టువు అని చూడకుండా సొంత చెల్లెలిని తీవ్రంగా కర్రతో కొట్టి చంపారు. మృతి చెందిన అనంతరం ఎవరికీ అనుమానం రాకుండా నోట్లో పురుగులమందు పోసి ఆత్మహత్య చేసుకుందని నమ్మించి మృతదేహానికి అంత్యక్రియలు నిర్వహించి పూడ్చిపెట్టారు. విషయం ఆ నోటా ఈ నోటా బయటికి పొక్కడంతో, రెవెన్యూ అధికారుల ఫిర్యాదు మేరకు పోలీసులు శుక్రవారం తండాను సందర్శించి కుటుంబ సభ్యులను విచారించారు.