కృష్ణా జలాల వివాదంపై బ్రిజేశ్ కుమార్ ట్రిబ్యునల్ ఉత్తర్వులను సవాలు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం బుధవారం సుప్రీంకోర్టులో స్పెషల్ లీవ్ పిటిషన్ దాఖలు చేసింది. ట్రిబ్యునల్ తీర్పు న్యాయ సమ్మతంగా లేదని అందులో అభిప్రాయపడింది. ఈ ఉత్తర్వులు తెలంగాణ ప్రజల సాగు, తాగునీటి అవసరాలను తీర్చేలా లేనందున వాటిని అమలు చేయకుండా స్టే ఇవ్యాలని కోర్టును కోరింది. కృష్ణా బేసిన్లోని రాష్ట్రాలన్నింటినీ ఒకే యూనిట్’ గా పరిగణించాలని, అన్ని రాష్ట్రాలకు ఒకే రీతిన నీటి కేటాయింపులు చేసి న్యాయం చేయాలని విన్నవించింది. ‘‘కృష్ణా బేసిన్‌లో 68.5 శాతం పరివాహక ప్రాంతం తెలంగాణలోనే ఉన్నా నీటి కేటాయింపులు మాత్రం 36.9 శాతమే! అదే 31.5 శాతం పరివాహక ప్రాంతమున్న ఏపీకి మాత్రం 63.1 శాతం కేటాయింపులు న్నాయి.