చిత్తూరు జిల్లా తిరుపతిలో సమైక్యాంధ్రకు మద్దతుగా గాంధీ బొమ్మ సర్కల్‌లో వైఎస్ఆర్ సీపీ నేత, తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి శుక్రవారం మంచి నీళ్ల దీక్షకు దిగారు. ఎమ్మెల్యేతో పాటు వందలాది మంది మహిళలు ఈ దీక్షలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా భూమన మాట్లాడుతూ రాష్ట్రం విడిపోతే సీమాంధ్ర ఎడారి అవుతుందన్నారు.సాగునీరే కాకుండా తాగునీటికి కూడా కరువు ఏర్పడుతుందని అన్నారు. రాయలసీమకు చుక్కనీరు కూడా రాదని భూమన ఆవేదన వ్యక్తం చేశారు. ఇంతటి జఠిల సమస్యలు ఉన్నా రాష్ట్ర విభజనపై కాంగ్రెస్ పార్టీ ఏకపక్ష నిర్ణయం తీసుకుందన్నారు. సీట్ల కోసం సోనియా గాంధీ కపట నాటకం ఆడుతుందని ఆయన విమర్శించారు. విభజనకు మద్దతుగా చంద్రబాబు నాయుడు లేఖ ఇచ్చి సీమాంధ్ర ప్రజల జీవితాలతో ఆడుకున్నాడని ఎమ్మెల్యే భూమన ఘాటుగా విమర్శించారు.
Aug 16 2013 12:21 PM | Updated on Mar 21 2024 6:14 PM
Advertisement
Advertisement
పోల్
Advertisement