విశాఖపట్నం విమానాశ్రయంలో పోలీసులు అదుపు తప్పి ప్రవర్తించారు. వైఎస్సార్‌సీపీ, వామపక్షాల నేతల పట్ల అమానుషంగా వ్యవహరించారు. ఈడ్చుకుంటూ తీసుకెళ్లి పోలీసు వ్యాన్లలో పడేశారు. విశాఖకు రైల్వే జోన్ విషయంలో ఎంపీ కె.హరిబాబు తీరుపై నిరసన తెలియజేయడానికి వైఎస్సార్‌సీపీ, సీపీఐ, ప్రజాసంఘాల నేతృత్వంలో అఖిలపక్ష నేతలు ఆదివారం సాయంత్రం విమానాశ్రయానికి వెళ్లారు. ఢి ల్లీ నుంచి సాయంత్రం 5 గంటల సమయంలో ఎంపీ హరిబాబు వచ్చారు. అంతకుముందే అక్కడకు అఖిలపక్ష నాయకులు పెద్దసంఖ్యలో చేరుకున్నారు. ఈ సంగతి తెలుసుకున్న పోలీసులు భారీగా ఎయిర్‌పోర్టు బయట మోహరించారు. హరిబాబు రాకముందే వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు గుడివాడ అమర్‌నాథ్ , సీఈసీ సభ్యుడు దామా సుబ్బారావు తదితరులను పోలీసులు వ్యాన్ల వద్దకు లాక్కెళ్లారు.