పెద్ద నోట్ల రద్దుతో దేశంలో నెలకొన్న పరిస్థితులపై ప్రధాని నరేంద్ర మోదీ సోమవారం తెల్లవారుజాము వరకూ కీలక సమావేశాలు నిర్వహించారు. కొత్త నోట్ల జారీలో తలెత్తిన సమస్యలు, బ్యాంకుల ముందు జనం పడిగాపులు, ప్రతిపక్షాల విమర్శల నేపథ్యంలో ఎలా ముందుకు వెళ్లాలనేదానిపై కేబినెట్ మంత్రులతో మంతనాలు జరిపారు. లోక్ కల్యాణ్ మార్గ్ లోని ప్రధాని నివాసంలో జరిగిన భేటీకి హోం మంత్రి అరుణ్ జైట్లీ, ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ, సమాచార, ప్రసారాల శాఖ మంత్రి వెంకయ్య నాయుడు, విద్యుత్ శాఖ మంత్రి పియూష్ గోయల్ తోపాటు ఆర్థిక శాఖకు చెందిన ఉన్నతాధికారులు హాజరయ్యారు.