నోట్ల రద్దు పేదల కోసమే :మోదీ | PM Modi comments on demonetisation | Sakshi
Sakshi News home page

Jan 8 2017 7:38 AM | Updated on Mar 20 2024 5:03 PM

పేదల బతుకుల్లో వెలుగులు నింపేందుకే నోట్ల రద్దు నిర్ణయం తీసుకున్నట్లు ప్రధాని మోదీ ఉద్ఘాటించారు. నల్లధనం, అవినీతిపై పోరాటానికే ఈ కఠిన నిర్ణయం తీసుకున్నామని చెప్పారు. మున్ముందు పేదల, సామాన్యుల జీవన ప్రమాణాలు మెరుగవుతాయన్నారు. శనివారం ఢిల్లీలో బీజేపీ జాతీయ కార్యవర్గ భేటీ ముగింపు సమావేశంలో ప్రధాని మాట్లాడారు. ‘నేను అధికారం కోసం పాకులాడను. స్వర్గం వద్దు.. మరో జన్మ వద్దు. పేదల సేవయే.. దేవుడి సేవ. పేదల జీవితాల్లో కష్టాలు తొలగిస్తే చాలు.’అంటూ ఓ సంస్కృత శ్లోకాన్ని ఉటంకించారు.

Advertisement
 
Advertisement
Advertisement