ఔటర్ రింగ్ రోడ్డుపై ఓ కంటెయినర్ అకస్మాత్తుగా అగ్రిప్రమాదానికి గురైంది. తారామతిపేట-పెద్దంబర్ పేట మధ్యలో ఔటర్ రింగ్ రోడ్డుపై వెళ్తుండగా కంటెయినర్ లో మంటలు చెలరేగి కొన్ని నిమిసాల్లో పూర్తిగా వాహనం దగ్ధమైంది. ఫైర్ సింబ్బంది అక్కడికి చేరుకుని మంటలను అదుపులోకి తెచ్చారు.