'ఇంతదాకా వచ్చి ఆపితే మూర్ఖత్వమే' | Nobody can stop Telangana says KCR | Sakshi
Sakshi News home page

Sep 19 2013 8:40 PM | Updated on Mar 21 2024 7:53 PM

హైదరాబాద్ కేంద్ర పాలిత ప్రాంతం అంటే పోరును ఉధృతం చేస్తాం అని తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షుడు కేసీఆర్ అన్నారు. నాంపల్లి లో టీజీవో కార్యాలయ కార్యక్రమంలో ఏర్పాటు చేసిన సమావేశంలో కేసీఆర్ మాట్లాడుతూ.. ఇంత దాకా వచ్చాక ఉద్యమాన్ని ఆపుతామనుకుంటే మూర్ఖత్వం అని ఆయన అన్నారు. తెలంగాణ విజయ తీరాలకు చేరడం ఖాయం ఆయన ధీమా వ్యక్తం చేశారు. తెలంగాణ ప్రకటన రాగానే చంద్రబాబు మాట మార్చారు అని అన్నారు. ఇక తెలంగాణను ఆపడం ఎవరి తరం కాదు కేసీఆర్ స్పష్టం చేశారు. స్వయంగా ప్రధానమంత్రే వెనక్కి వెళ్లేది లేదు అని అన్నాడని ఆయన తెలిపారు. మనమంతా అప్రమత్తంగా ఉండాల్సిన సమయం ఆసన్నమైంది అని.. తాను అదే పనిలో ఉన్నానని కేసీఆర్ అన్నారు. సీమాంధ్ర ఉద్యమంలో మేధావుల ఛాయ లేదు అని వ్యాఖ్యానించారు.

Related Videos By Category

Related Videos By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement