చలో అమరావతి పాదయాత్రపై వెనక్కి తగ్గే ప్రసక్తే లేదని కాపు ఉద్యమ నేత, మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం స్పష్టం చేశారు. పాదయాత్రకు అనుమతి లేదంటూ ఆయనను ప్రభుత్వం వారం పాటు గృహ నిర్బంధం చేసిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా ముద్రగడ శుక్రవారమిక్కడ మాట్లాడుతూ...‘ఎప్పుడు అనుమతి ఇస్తే అప్పుడే పాదయాత్ర చేస్తా. నేను నడవలేనని హోంమంత్రి అంటున్నారు. నాకు అనుమతి ఇచ్చి చూడండి. పాదయాత్ర చేసి చూపిస్తా. ఐపీఎస్‌ల గౌరవాన్ని డీజీపీ దిగజార్చొద్దు. ఏడాది సర్వీస్ పొడిగింపు కోసం చంద్రబాబుకు వత్తాసు పలకొద్దు.