అమ్మను మించిన దైవం లేదంటారు. అయితే నవమాసాలు మోసిన ఓ తల్లే తన కుమారుడిని కడతేర్చింది. కొడుకు మృతదేహాన్ని గోనెసంచిలో చుట్టి ఆరు రోజుల పాటు ఇంటి పక్కనే దాచింది. అంతటితో ఆగకుండా ఉన్మాదిలా మారి కొడుకు మృతదేహం నుంచి రోజుకో అవయవాన్ని నరికేస్తోంది. రెండురోజుల క్రితం మృతదేహం నుంచి చెయ్యిని వేరుచేసి సంచిలో పెట్టింది. బుధవారం రాత్రి తల నరుకుతుండగా స్థానికులు గుర్తించి పోలీసులకు సమాచారం అందించడంతో ఈ ఘాతుకం వెలుగులోకి వచ్చింది.