కర్ణాటకలో ఘోర ప్రమాదం సంభవించింది. చింతామణిలోని హెచ్‌పీ గ్యాస్ ఏజెన్సీలో భారీ అగ్రి ప్రమాదం చోటు చేసుకుంది. దాదాపు వెయ్యి సిలిండర్లు ఒక్కసారిగా పేలిపోయాయి. దీంతో దానికి చుట్టుపక్కల ఉన్న ప్రజలు భయాందోళనలతో కేకలు వేస్తూ పరుగులు పెట్టారు. ఈ ఘటనలో మూడు వాహనాలు కూడా పూర్తిగా దహనమయ్యాయి.