కాంగ్రెస్ రాక్షసక్రీడ ఆడుతోంది: ఎంపీ మేకపాటి | Mekapati fire on Sonia about State Division | Sakshi
Sakshi News home page

Aug 2 2013 4:16 PM | Updated on Mar 20 2024 3:51 PM

వైఎస్ జగన్‌ను ఎదుర్కొనే కుట్రలో భాగంలో కాంగ్రెస్ రాక్షసక్రీడ ఆడుతోందని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు నెల్లూరు ఎంపీ మేకపాటి రాజమోహన్ రెడ్డి విమర్శించారు. వైఎస్ రాజశేఖర రెడ్డి ఉంటే రాష్ట్రానికి ఈ గతి పట్టేది కాదన్నారు. దేశాన్ని తమ కుటుంబమే పరిపాలించాలన్న సోనియా గాంధీ స్వార్థమే ఈ పరిస్థితికి కారణమని పేర్కొన్నారు. రాష్ట్ర విభజనపై సోనియా నిర్ణయాన్ని దుర్మార్గపు చర్యగా ఆయన వర్ణించారు. రాష్ట్ర విభజన నిర్ణయంతో దేశవ్యాప్తంగా ఉద్యమాలు పెరిగాయని మేకపాటి రాజమోహన్ రెడ్డి తెలిపారు. కాంగ్రెస్, చంద్రబాబు నాయుడు తాము తీసుకున్న గోతిలో వాళ్లే పడ్డారని ఎద్దేవా చేశారు. తెలంగాణ ప్రాంతంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి విశేష ప్రజాదరణ ఉందని ఆయన చెప్పారు. రాష్ట్ర విభజనకు అనుకూలంగా కాంగ్రెస్ నిర్ణయం తీసుకోవడంతో సీమాంధ్రలో నిరసనలు, ఆందోళనలు పెల్లుబికాయి. పలు జిల్లాల్లో ఆందోళనకారులు జాతీయ నాయకుల విగ్రహాలను పెద్ద ఎత్తున ధ్వంసం చేసిన సంగతి తెలిసిందే. సమైక్యాంధ్రకు మద్దతుగా పలువురు ప్రజా ప్రతినిధులు రాజీనామాలు చేశారు.

Advertisement
 
Advertisement

పోల్

Advertisement