వోల్వో బస్సు డ్రైవర్ ఓవర్ టేక్ చేయటం వల్లే ప్రమాదం జరిగిందని మహబూబ్నగర్ జిల్లా ఎస్పీ నాగేంద్ర కుమార్ తెలిపారు. క్లీనర్ను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు ఆయన తెలిపారు. మహబూబ్నగర్ జిల్లా కొత్తకోట సమీపంలో బెంగళూరు నుంచి హైదరాబాద్ వస్తున్న వోల్వో బస్సు (AP 02 TA 0963) ఘోర ప్రమాదానికి గురైంది. ఈరోజు తెల్లవారుజామున 4.30 గంటల ప్రాంతంలో జరిగిన ఈ ప్రమాదంలో 45మంది సజీవ దహనం అయ్యారు. ప్రమాదం జరిగిన బస్సులో 49మంది ప్రయాణిస్తున్నారు. అయితే కేవలం అయిదుగురు మాత్రమే ఈ ప్రమాదం నుంచి ప్రాణాలతో బయటపడినట్లు తెలుస్తోంది. మిగతవారు సజీవ దహనం తెలుస్తోంది. కాగా గాయపడిన వారిని మెరుగైన చికిత్స నిమిత్తం అపోలో ఆస్పత్రికి తరలించారు.
Oct 30 2013 10:22 AM | Updated on Mar 21 2024 7:54 PM
Advertisement
Advertisement
పోల్
Advertisement