ఈనెల 6న లోకసభ స్పీకర్ ఎన్నిక: వెంకయ్య | lok-sabha-speaker-election-on-june-6th | Sakshi
Sakshi News home page

Jun 3 2014 6:59 PM | Updated on Mar 22 2024 11:31 AM

లోక్‌సభలో రేపు ప్రొటెం స్పీకర్ ప్రమాణం చేస్తారని పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి ఎం. వెంకయ్య నాయుడు తెలిపారు. గోపీనాథ్ ముండేకు సంతాపం తెలిపిన అనంతరం లోక్‌సభ ఎల్లుండికి వాయిదా పడుతుందని చెప్పారు. ఈనెల 5, 6 తేదీల్లో సభ్యుల ప్రమాణ స్వీకారం ఉంటుందన్నారు. 6వ తేదీ మధ్యాహ్నం లోకసభ స్పీకర్ ఎన్నిక నిర్వహించాలని భావిస్తున్నట్టు వెల్లడించారు. 9న లోక్‌సభను ఉద్దేశించి రాష్ట్రపతి ప్రసంగిస్తారని చెప్పారు. 10, 11 తేదీల్లో రాష్ట్రపతి ప్రసంగంపై చర్చ ఉంటుందని వెంకయ్య నాయుడు తెలిపారు. కాగా, గోపీనాథ్ ముండే మరణం నేపథ్యంలో కేంద్ర కేబినెట్ ప్రత్యేకంగా సమావేశమయింది. ముండే మృతికి సంతాపం తెలిపింది. రేపు, ఎల్లుండి సంతాప దినాలు పాటించాలని కేంద్ర కేబినెట్ తీర్మానం చేసింది.

Related Videos By Category

Related Videos By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement