లెక్క చూపని, పన్ను కట్టని డిపాజిట్లలో కొరడా ఝళిపించేందుకు, అక్రమంగా నల్లధనాన్ని సక్రమధనంగా మార్చుకునే ప్రయత్నాలకు అడ్డుకట్ట వేసేందుకు కేంద్రం ఈ బిల్లును తీసుకొచ్చింది. లెక్క చూపని డిపాజిట్లలో ఏకంగా 73శాతం వరకు ప్రభుత్వపరమయ్యేవిధంగా నిబంధనలను మార్చింది. లెక్కచూపని డిపాజిట్లపై 30శాతం పన్ను, 10శాతం పెనాల్టీ, 33శాతం సర్‌చార్జి విధించనున్నారు. అదేవిధంగా లెక్కచూపని డిపాజిట్లలో 25శాతాన్ని ప్రధానమంత్రి గరీబ్ కల్యాణ్ డిపాజిట్ పథకంలో జమచేయనున్నారు. రూ. 2.5 లక్షల కంటే ఎక్కువమొత్తాన్ని డిపాజిట్ చేసినవారికి ఈ నిబంధనలు వర్తించనున్నాయి. ఆదాయపన్ను చెల్లించిన డిపాజిట్లపై 50శాతం పన్ను విధించనున్నారని, మిగతా మొత్తంలో 25శాతాన్ని లాక్ చేసి.. కేవలం 25శాతం మాత్రమే అందుబాటులో ఉంచుతారని గతంలో కథనాలు వచ్చిన సంగతి తెలిసిందే.