పశ్చిమ గోదావరి జిల్లా పోలవరంలోని మూలలంక, అమరావతి ప్రాంతంలోని కృష్ణానది లంక భూముల రైతులు కన్నీరు ఆంధ్రప్రదేశ్‌కు క్షేమదాయంకాదని జనసేన పార్టీ అభిప్రాయపడింది. టీడీపీ ఎంపీ రాయపాటి సాంబశివరావుకు చెందిన పోలవరం గుత్తేదారు కంపెనీ ట్రాన్ స్టాయ్ అడ్డగోలుగా రైతుల భూమిని డంపింగ్ యార్డ్‌గా మార్చేస్తే ప్రజలు ఏ విధంగా ఆలోచిస్తారన్న వివేకం కూడా చూపకపోతే ఎలా అని ఆ పార్టీ అధినేత పవన్ కల్యాణ్ ప్రశ్నించారు.