రైతు భరోసా యాత్ర నుంచి సాక్షి ప్రత్యేక ప్రతినిధి: ‘ఎన్నికల ముందు అందరికీ పింఛన్లు ఇస్తానని చంద్రబాబు హామీ ఇచ్చారు. ఎన్నికల్లో గెలిచిన తర్వాత పెన్షన్లు ఎలా కత్తిరించాలా అన్న దిక్కుమాలిన ఆలోచన చేస్తున్నారు. అవ్వాతాతలకు పింఛన్లు ఇవ్వడం లేదు. పింఛను రాని అవ్వాతాతలందరూ ఆధార్, రేషన్ కార్డులు ఇవ్వండి. పింఛన్లపై లోకాయుక్తలో కేసు వేసి పోరాటం చేద్దాం. చంద్రబాబుకు బుద్ధిచెబుదాం’ అని వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి పిలుపునిచ్చారు.