తెలుగు రాష్ట్రాల ఉమ్మడి రాజధాని నగరంలో ఆదివారం ఉదయం పలు ప్రాంతాల్లో వర్షం కురవడం ప్రారంభమైంది. సిటీలోని హయత్ నగర్, సికింద్రాబాద్, తార్నాక, ఉప్పల్, వనస్థలిపురం, మియాపూర్, కూకట్ పల్లి, ఎర్రగడ్డ, అమీర్ పేట, బాలానగర్, ఖైరతాబాద్, నాంపల్లి, దిల్సుఖ్నగర్, బంజారాహిల్స్ ప్రాంతాల్లో ఓ మోస్తరుగా వర్షం కురుస్తోంది. దిల్సుఖ్నగర్తో ఉదయం 6.30 కి మొదలైన వర్షం 8.00 గంటలకు బంజారాహిల్స్ దాకా విస్తిరించింది. ఆదివారం తెలంగాణలోని కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా పలుచోట్ల వడగండ్ల వానలు కురిశాయి. వరణుడి దెబ్బకు జిల్లాలో మామిడి, మొక్కజొన్న, నువ్వులు, పసుపు పంటలకు నష్టం వాటిల్లింది. పలు గ్రామాలకు విద్యుత్ అంతరాయం కలిగింది. రాయలసీమ నుంచి ఛత్తీస్గఢ్ మీదుగా రాయపూర్ వరకు ఉపరితల వర్తనం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. ఈ ప్రభావంతోనే తెలంగాణలో వర్షాలు కురుస్తున్నాయని వారు చెప్పారు. శనివారం రాయలసీమలో సగటు ఉష్ణోగ్రతలు 39 డిగ్రీలుగా నమోదయ్యాయి.