ఏపీ సీఎం చంద్రబాబు తనయుడు, టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్పై విశాఖ జిల్లా వైఎస్ఆర్ సీపీ అధ్యక్షుడు గుడివాడ అమర్నాథ్ నిప్పులు చెరిగారు. బుధవారం విశాఖపట్నంలో గుడివాడ అమర్నానాథ్ విలేకర్లతో మాట్లాడుతూ... జిల్లాలో నారా లోకేష్ భూ దందాలకు పాల్పడుతున్నారని ఆరోపించారు.