మరోసారి ఢిల్లీకి వెళ్లనున్న గవర్నర్ | governor narasimhan moves to delhi | Sakshi
Sakshi News home page

Jun 25 2015 12:12 PM | Updated on Mar 22 2024 11:04 AM

తెలుగు రాష్ట్రాల ఉమ్మడి గవర్నర్ నరసింహన్ మరోసారి ఢిల్లీకి వెళ్లనున్నారు. ఆయన గురువారం సాయంత్రం ఢిల్లీకి బయల్దేరి వెళ్లనున్నారు. సాయంత్రం నాలుగు గంటల ప్రాంతంలో గవర్నర్ ఢిల్లీకి పయనం కానున్నట్లు తెలుస్తోంది. ఓటుకు నోటుకు వ్యవహారం మరింత ముదిరి ఇరు రాష్ట్రాల మధ్య పెను వివాదానికి దారి తీస్తున్న నేపథ్యంలో ఆయన పర్యటన ప్రాధాన్యం సంతరించుకుంది. ఈ మొత్తం వ్యవహారంపై గవర్నర్ నివేదిక ఇవ్వనున్నట్లు సమాచారం. ఈ కేసుకు సంబంధించిన పురోగతిని గవర్నర్ వివరించే అవకాశం ఉంది. గవర్నర్ ఢిల్లీ పర్యటనతో హైదరాబాద్ నగరంలోని సెక్షన్ -8 అంశానికి సంబంధించి ఒక స్పష్టత వచ్చే అవకాశం ఉంది.

Advertisement
 
Advertisement
Advertisement