ఉగ్రవాద శిబిరాలపై సర్జికల్ స్ట్రైక్స్ ఆపరేషన్ను భారత సైన్యం వ్యూహాత్మకంగా విజయవంతం చేసిందని భారత మాజీ లెఫ్ట్నెంట్ జనరల్ ఏఆర్ రెడ్డి అన్నారు. ఆయన శుక్రవారం ’సాక్షి టీవీ’ తో మాట్లాడుతూ ...దాడి విషయంలో ఇందుకు 10 ఏళ్లుగా పక్కాగా సేకరించిన సమాచారం ఎంతో ఉపయోగపడిందన్నారు. ఆలస్యంగా అయినా పాకిస్తాన్కు భారత్ సైన్యం తగిన బుద్ధి చెప్పిందని ఏఆర్ రెడ్డి వ్యాఖ్యానించారు. కేంద్ర ప్రభుత్వం సరైన సమయంలో మంచి నిర్ణయం తీసుకుందని ఆయన అన్నారు.