రియల్ ఎస్టేట్ వ్యాపారిపై బుధవారం రాత్రి 10.45 గంటల సమయంలో ఓ వ్యక్తి రివాల్వర్‌తో కాల్పులు జరిపాడు. ఈ ఘటన నగరంలో కలకలం సృష్టించింది. పేట్‌బషీరాబాద్ బాపూనగర్‌కు చెందిన నాగేందర్ రెడ్డి రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నారు. వాజ్‌పేరుు నగర్‌కు చెందిన తేజ గత 3 నెలల నుంచి ఓ స్థల వివాదంలో నాగేందర్ రెడ్డితో వాగ్యుద్ధానికి దిగసాగాడు. ఈ క్రమంలోనే తేజ బుధవారం రాత్రి 10.45 గంటలకు బాపూనగర్‌లోని నాగేందర్ రెడ్డి ఇంటికి వెళ్లి, రివాల్వర్‌ను ఆయన తలపై గురిపెట్టి కాల్చే ప్రయత్నం చేశాడు. దీన్ని తప్పించుకునే క్రమంలో నాగేందర్‌రెడ్డికి వెన్నులో బుల్లెట్ దిగింది. రెండో బుల్లెట్ మిస్‌ఫైర్ అరుుంది.